దినకరన్ కు సమన్లు జారీ!

April 20, 2017


img

అన్నాడిఎంకె పార్టీ రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి కేంద్ర ఎన్నికల కమీషన్ కు డిల్లీలో ఒక బ్రోకరు ద్వారా రూ.50 కోట్లు లంచం ఇవ్వజూపినందుకు డిల్లీ పోలీసులు ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన సంగతి తెలిసిందే. వారు చెన్నై అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ ద్వారా నిన్న దినకరన్ కు సమన్లు అందజేశారు. ఈకేసు వివరణ ఇచ్చేందుకు ఆయనను డిల్లీ రమ్మని ఆదేశించినట్లు సమాచారం. అయన దేశం విడిచిపారిపోయే అవకాశం ఉందని భావించడంతో అన్ని విమానాశ్రయాలకు లుక్-అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇంతకీ డిల్లీ పోలీసులు ఆయనకు జారీ చేసిన సమన్లలో ఏముందనే విషయం బయటకు పొక్కనీయలేదు. కానీ త్వరలోనే ఆ సంగతీ బయటపడుతుంది.

తనపై లుక్-అవుట్ నోటీసులు జారీ చేసినందుకు దినకరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “గత 20 ఏళ్లుగా నా పార్లమెంటు సమావేశాలు పోర్ట్ పోలీసుల వద్దే ఉన్నపుడు నేను దేశం విడిచి ఎలా పారిపోగలనను కొంటున్నారు? అయిన నేనే నేరం చేయనప్పుడు ఎందుకు పారిపోవాలి? నాపై మోపబడిన ఆరోపణలను నేను ధైర్యంగా న్యాయస్థానంలోనే ఎదుర్కొంటాను,” అని దినకరన్ అన్నారు.  


Related Post