తెలంగాణా బడ్జెట్ వివరాలు:

March 13, 2017


img

తెలంగాణా ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర శాసనసభలో 2017-18 సం.లకి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ విలువ మొత్తం రూ.1,49,646కోట్లు. దానిలో వివిధ శాఖలు, కార్యక్రమాలకు చేసిన కేటాయింపులు ఈవిధంగా ఉన్నాయి.  

నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు; ప్రగతిపద్దు రూ. 88,038.80కోట్లు, ద్రవ్యలోటు: రూ.26, 096 కోట్లు; రెవెన్యూ మిగులు అంచనా రూ.4, 571.3 కోట్లు. 

శాఖల వారిగా కేటాయింపులు: 

నీటిపారుదల శాఖ: రూ.25,000 కోట్లు, పంచాయతీరాజ్: రూ.14,723కోట్లు, విద్యా శాఖ: రూ.12, 705 కోట్లు పరిశ్రమల శాఖ: రూ.9,85.15 కోట్లు, వ్యవసాయ శాఖ: రూ.5, 942కోట్లు, మున్సిపాల్ శాఖ: రూ.5,599 కోట్లు, రోడ్లు, భవనాల శాఖ: రూ.5, 033 కోట్లు, వైద్య శాఖ: రూ.5, 976 కోట్లు, హోం శాఖ:  రూ.4,828 కోట్లు, విద్యుత్ శాఖ: రూ.4,203.21 కోట్లు పర్యాటక శాఖ: రూ.198.03 కోట్లు, మహిళా శిశుసంక్షేమ శాఖ: రూ.1,731 కోట్లు, చేనేత శాఖ: రూ.1,200 కోట్లు, సమాచార ప్రసారశాఖ: రూ.252. 89 కోట్లు, 

సంక్షేమ కేటాయింపులు:

బీసీ సంక్షేమం: రూ.5,070కోట్లు, ఎస్సీ సంక్షేమం: రూ.14375 కోట్లు, ఎస్టీ సంక్షేమం: రూ.8,165 కోట్లు, మైనార్టీ సంక్షేమం: రూ.1,249 కోట్లు, 

కులాల వారిగా కేటాయింపులు:

ఎం.బి.సి.లకు: రూ.1,000 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమం: రూ.100 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమం: రూ.30 కోట్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు: రూ.500 కోట్లు, 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెల పంపిణీ

సంక్షేమ పధకాలు:

ఆసరా పథకం: రూ.5,330 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ : రూ.7, 5116 కోట్లు, పంట రుణాల మాఫీ: రూ.4,000 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్: రూ.1,939 కోట్లు

మిషన్‌ భగీరథకు రూ.3,000 కోట్లు, జి.హెచ్.ఎం.సి: రూ.1,000 కోట్లు, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌: రూ.300 కోట్లు, మూసీ నది పరిరక్షణ: రూ.3,060 కోట్లు, హరితహారం: రూ.50 కోట్లు.


Related Post