హైదరాబాద్‌లో టెస్టింగ్, సర్టిఫికేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి

January 23, 2021


img

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ శివార్లలోని జినోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్,  సర్టిఫికేషన్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ వ్యాక్సిన్ రాజధానిగా మారుతున్న సమయంలో టెస్టింగ్ సర్టిఫికేషన్ సెంటర్, ల్యాబ్ చాలా ముఖ్యమని కేటీఆర్‌ లేఖలో సూచించారు. హైదరాబాద్‌లో చాలా భారీగా రకరకాల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని కనుక వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్,  సర్టిఫికేషన్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రస్తుతం వ్యాక్సిన్ టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ కోసం ప్రతిసారి హిమాచల్ ప్రదేశ్‌, కవసలిలో ఉన్న సెంట్రల్ డ్రగ్ సెంటర్‌, సర్టిఫికేషన్ ల్యాబరేటరీకి వెళ్లాల్సి వస్తోందని దాని వలన విలువైన సమయము, డబ్బు వృధా అవుతున్నాయన్నారు. కనుక దేశానికి నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌లో డ్రగ్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనపై కేంద్రం జీనోమ్ వ్యాలీలో ఉన్న ఫార్మా, హెల్త్ సైన్సస్ సంస్థలతో చర్చించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని  కోరారు. అలాగే హైదరాబాద్‌ నగరంలో సెంట్రల్ మెడికల్ స్టోర్ డిపో, దానికి సంబందించిన డాటా మానిటరింగ్ సిస్టం, ట్రాకింగ్ సిస్టమ్ తదితర వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


Related Post