శశికళకు తీవ్ర అనారోగ్యం

January 22, 2021


img

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికళ మరో 5 రోజులలో పరప్పన అగ్రహార జైలు నుండి విడుదలకావలసి ఉండగా గత వారంరోజులుగా ఆమె అస్వస్థతతో ఉన్నారు. ఆమెకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో బుదవారం ఉదయం జైలు సిబ్బంది ఆమెను బెంగళూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ రెండుసార్లు పరీక్షించి చూడగా కరోనా లేదని నిర్ధారణ అయ్యింది. కానీ ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కొరకు జైలు సిబ్బంది ఆమెను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు మళ్ళీ పరీక్షలు చేయగా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆమెకు బీపీ, షుగర్ వ్యాధులు కూడా ఉండటంతో కరోనా ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. ఆమె ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే ఆమె ఆరోగ్యపరిస్థితి సంతృప్తికరంగా లేదని తెలిపారు. 

అక్రమాస్తుల కేసులో ఆమె గత నాలుగేళ్ళుగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నెల 27న శశికళ జైలు నుండి విడుదలకావలసి ఉండగా హటాత్తుగా అనారోగ్యం పాలవడంతో ఆమె మేనల్లుడు దినకరన్ అనుమానం వ్యక్తం చేశారు.


Related Post