కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ వినతి

January 22, 2021


img

మంత్రి కేటీఆర్ గురువారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దక్షిణాన ఉన్న రైల్వే ప్రాజెక్టుల పట్ల తగినన్ని నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలలో నుంచి ఎక్కువ ఎక్కువ ఆదాయం వస్తున్నప్పటికీ కేంద్రం చిన్న చూపిస్తుందని ఆరోపించారు. దక్షిణాది మహా నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై హైస్పీడ్ రైలు, బుల్లెట్ రైలు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే కనీసం ఈ బడ్జెట్‌లోనైనా కాజీపేట రైల్వే వాగన్ వర్క్ షాపుకు నిధులు కేటాయించాలన్నారు. కాజీపేట రైల్వే వాగన్ వర్క్ షాపుకు కేంద్రం 135 ఎకరాల భూమి కోరగా, తెలంగాణ ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించిందని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్రం దక్షిణాది రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టులకు తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.


Related Post