హైదరాబాద్‌లో సిటీబస్సులు పెంచుతాం: పువ్వాడ

January 22, 2021


img

లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత కూడా కరోనా భయాల నేపధ్యంలో హైదరాబాద్‌లో 50 శాతం సిటీ బస్సులనే నడిపించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం నగరంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినందున వాటిని 75 శాతానికి పెంచాలనే ఆర్టీసీ ప్రతిపాదనను సిఎం కేసీఆర్‌ అంగీకరించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ మీడియాకు తెలిపారు. గురువారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితులపై అధికారులతో సిఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిటీబస్సుల సంఖ్యను పెంచాలనే టీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదనకు సిఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. 

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తరువాత నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఐ‌టి కంపెనీలు, మార్కెట్లు మళ్ళీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నందున ప్రజల రాకపోకలు పెరిగాయి. కానీ టీఎస్‌ఆర్టీసీ నగరంలో 50 శాతం సిటీ బస్సులనే తిప్పుతుండటం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై వారికి ఆ ఇబ్బందులు తగ్గనున్నాయి.      



Related Post