జోద్‌పూర్‌లో భారత్‌-ఫ్రాన్స్ వాయుసేన యుద్ధవిన్యాసాలు

January 22, 2021


img

భారత్-ఫ్రాన్స్ వాయుసేనలు ‘డిసర్ట్ నైట్-21’ పేరుతో రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లోని భారత్‌-పాక్ సరిహద్దులలో సంయుక్త యుద్ధ విన్యాసాలు ప్రారంభించాయి. ఇవి బుదవారం నుంచి ఆదివారం వరకు జరగనున్నాయి. మొదటిరోజునే మొదటిసారిగా భారత్‌ వాయుసేనకు చెందిన పైలట్లు రాఫెల్ యుద్ధ విమానాలతో ఈ విన్యాసాలలో  పాల్గొన్నారు. తద్వారా వాటి శక్తిసామర్ధ్యలను మరోసారి శతృదేశాలకు చాటిచెప్పడమే కాకుండా యుద్ధం సంభవిస్తే వాటితో ధీటుగా ఎదుర్కోగలమని సందేశం పంపించినట్లయ్యింది. ఈ యుద్ధవిన్యాసాలలో సుఖోయ్, మిరాజ్ యుద్ధ విమానాలను కూడా ప్రదర్శించారు. మొదటిరోజు సుమారు గంటన్నరపాటు సాగిన ఈ సంయుక్త యుద్ధవిన్యాసాలలో భారత్‌-ఫ్రాన్స్  యుద్ధవిమానాల నుంచి డమ్మీ క్షిపణులను కూడా ప్రయోగించి చూపారు. ఈనెల 26న ఢిల్లీలో జరుగబోయే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రాఫెల్ యుద్ధ విమానాలు మొదటిసారిగా ప్రదర్శించనున్నారు.



Related Post