భారత్‌ వాయుసేనకు మరో 83యుద్ధవిమానాలు

January 15, 2021


img

ఓ పక్క చైనా...మరో పక్క పాకిస్థాన్‌ల నుంచి నిత్యం సవాళ్ళు విసురుతుండటంతో భారత్‌ రక్షణరంగం మరింత బలోపేతం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే తప్పనిసరి పరిస్థితులలో విదేశాల నుంచి యుద్ధవిమానాలను, యుద్ధసామాగ్రిని కొనుగోలు చేస్తున్నప్పటికీ దేశీయంగా తయారుచేసుకొనేందుకే కేంద్రప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. అందుకే 83 తేజస్ యుద్ధవిమానాలు తయారీకి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను ఎంపిక చేసింది.  ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుదవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.48,000 కోట్లతో హెచ్ఏఎల్ నుంచి 83 తేజస్ యుద్ధవిమానాల కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. వాటిలో 73 యుద్ధవిమానాలు, 10 శిక్షణా విమానాలు ఉంటాయి. రక్షణరంగంలో కూడా స్వయంసంవృద్ధి సాధించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు. తేజస్ యుద్ధవిమానాలను సకాలంలో తయారుచేసి అందించేందుకు వీలుగా బెంగళూరు, నాసిక్‌లో హెచ్ఏఎల్ ప్లాంట్లను విస్తరిస్తున్నట్లు మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ చెప్పారు. 



Related Post