భూవివాదాల పరిష్కారానికి రెవెన్యూ ట్రిబ్యూనల్ ఏర్పాటు

January 13, 2021


img

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న భూవివాదాల సత్వర పరిష్కారానికి రెవెన్యూ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసేందుకు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. భూ వివాదాల సత్వర పరిష్కారం కోసం అన్ని జిల్లాలలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటికి ఆయా జిల్లా కలెక్టర్లకు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ట్రిబ్యునల్స్ ద్వారా రాష్ట్రంలో ఉన్న భూవివాదాల కేసులన్నిటినీ నెల రోజుల్లోగా పరిష్కరించాలని సిఎం కేసీఆర్‌ గడువు విధించారు. రాష్ట్రంలో 16,137 భూవివాదాల కేసులున్నాయి. ఆ కేసులన్నీ పరిష్కరించేవరకు రెవెన్యూ ట్రిబ్యునల్స్ ను కొనసాగిస్తామని ఆ తరువాత వాటిని కొనసాగించాలా..వద్దా...అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.



Related Post