రేషన్‌కు బయోమెట్రిక్ రద్దు... ఫిబ్రవరి నుంచి ఓటిపి

January 13, 2021


img

తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రేషన్ దుకాణంలో ప్రస్తుతం ఉన్న బయోమెట్రిక్ విధానానికి త్వరలో స్వస్తి పలకనున్నారు. కరోనా కారణంగా ఈ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ బదులు ఆహారభద్రత కార్డులో ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైం పాస్ వర్డ్(ఓటీపీ)పంపిస్తామని అది చెప్పి రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. పౌరసరఫరాశాఖ ఈ మేరకు రేషన్ దుకాణాలకు ఆదేశాలను జారీ చేసింది. ఈ ఓటీపీ విధానాన్ని వచ్చే నెల నుంచి అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు. కనుక రేషన్ సరుకులను తీసుకునేవారందరూ తప్పనిసరిగా తమ ఆహారభద్రత కార్డుకి తమ మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు.



Related Post