కాంగ్రెస్‌ ఎనికల మ్యానిఫెస్టోలో భారీ హామీలు

November 24, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ్ళ తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. దానిలో ముఖ్యాంశాలు: 

 వరదబాధిత కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ. 50,000 నష్టపరిహారం చెల్లిస్తాం. 

 వరదలలో పూర్తిగా దెబ్బ తిన్న ఇళ్లకు రూ.5 లక్షలు, పాక్షికంగా దెబ్బ తిన్న ఇళ్లకు రూ.2.5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తాం.

 అర్హత కలిగిన వారందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తాం. వీటికోసం నగరంలో మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తాం. 

 సొంతజాగా ఉన్నవాళ్లకు ఇళ్ళు నిర్మించుకొనేందుకు రూ. 8 లక్షలు, ఒక బెడ్ రూమ్ ఇల్లున్నవారికి మరో బెడ్ రూమ్ వేసుకొనేందుకు రూ.4 లక్షలు ఆర్ధికసాయం ఇస్తాం. 

 80 గజాల లోపు ఇళ్ళున్నవారికి ఆస్తిపన్ను పూర్తిగా రద్దు చేస్తాం. 

 ప్రతీ ఇంటికి 100 యూనిట్లలోపు విద్యుత్ బిల్లు ఉండదు. 

 ప్రతీ ఇంటికీ నెలకు 30,000 లీటర్ల త్రాగునీటి ఉచితంగా అందిస్తాం.  

 మహిళలు, వృద్ధులు, వికలాంగులకు మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

 ఉచిత ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ విధానాలను అమలుచేస్తాం. 

 కేబిల్ టీవీ ఆపరేటర్లకు పోల్‌ ఫీజు మాఫీ చేస్తాం. 

 మార్చి నుంచి సెప్టెంబర్ వరకు (లాక్‌డౌన్‌ సమయం) మోటారువాహనాల పన్ను రద్దు చేస్తాం. 

 పారిశుద్య కార్మికులకు, వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున భీమా చేయిస్తాం. 

 నగరంలో మురికివాడలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. 

 నగరంలో కొత్తగా 5,000 కిమీ మేర మురికి కాలువలు, వరదనీటి కాలువలను నిర్మిస్తాం. 

 టీఎస్‌ఆర్టీసీని కాపాడుకొనేందుకు, నగర ప్రజలకు తక్కువధరలో ప్రయాణించేందుకు బస్సుల సంఖ్యను పెంచుతాము. నగరం నలుమూలలకు బస్సులను తిప్పుతాం.   

 నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు గట్టిగా కృషి చేస్తాం. 

 నగరంలో అన్నపూర్ణా క్యాంటీన్ల సంఖ్యను పెంచుతాం. 

 నగరంలో కొత్తగా గ్రంధాలయాలను ఏర్పాటు చేసి వాటిలో వికలాంగులకు ఉద్యోగాలు కల్పిస్తాం. 

 లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలకు, వ్యాపారసంస్థలకు పన్ను రాయితీలు ఇస్తాం. 

 ధరణీ పోర్టల్‌ రద్దుకు కృషి చేస్తాం. 

 కేంద్రం మెడలు వంచి నిధులు తెచ్చి హైదరబాద్ నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం. 


Related Post