సాదాబైనామాల క్రమబద్దీకరణ గడువు పొడిగింపు

October 31, 2020


img

సాదాబైనామా (తెల్లకాగితాలపై వ్రాసుకొని జరిపే ఆస్తుల క్రయవిక్రయాలు)లతో రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములను, ఆస్తులను కొనుగోలుచేసినవారికి ఓ శుభవార్త. వాటిని ఉచితంగా క్రమబద్దీకరించుకొనేందుకు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. మంత్రులు,ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు సిఎం కేసీఆర్‌ ఆ గడువును మరో వారం రోజులు పొదిగిస్తున్నట్లు ఇవాళ్ళ కొడకండ్ల గ్రామంలో ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ను సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో విలీనమైన గ్రామాలలో సాదాబైనామాల ద్వారా కొనుగోలుచేసిన వ్యవసాయభూములను క్రమబద్దీకరించుకొనేందుకు ఇదే చివరి అవకాశామని సిఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎలాగూ ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తోంది కనుక గడువులోగా దరఖాస్తు చేసుకోవడం చాలా మంచిది లేకుంటే గడువు ముగిసిన తరువాత సాదాబైనామా భూములను కొనుగోలు చేసిన రైతులే నష్టపోతారు.



Related Post