నేడు సద్దుల బతుకమ్మ పండుగ

October 24, 2020


img

తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైన పూలపండుగ బతుకమ్మ పండుగ...ఈసారి కరోనా, వరదల కారణంగా బతుకమ్మ పండుగ కళ తప్పింది. ఏటా సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం కరోనా భయంతోనే ఈ ఏడాది ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. 

రాష్ట్రంలో వర్షాలు, వరదలు తగ్గి వాతావరణం మళ్ళీ కుదుటపడటంతో తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఇవాళ్ళ సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకొంటున్నారు. ఈ పండుగ ముగియగానే రేపు దసరా పండుగ కనుక మహిళలు ఉత్సాహంగా మార్కెట్లకు వెళ్ళి పూలు, పళ్ళు, కొత్తబట్టలు వగైరా కొనుగోలు చేస్తున్నారు. తొమ్మిదిరోజుల పాటు సాగే బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ నిమజ్జనంతో పూర్తవుతుంది. బతుకమ్మ కోసం మళ్ళీ ఏడాది వరకు ఎదురుచూడవలసిందే. అందుకే ఈ పండుగ చివరి రోజైన ఇవాళ్ళ రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సాగనంపేందుకు మహిళలు సిద్దం అవుతున్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సిఎం కేసీఆర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా రాష్ట్రంలో కరోనా పొంచి ఉన్నందున మహిళలు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేసారు.


Related Post