పోలీస్‌ శాఖలో 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం

October 24, 2020


img

తెలంగాణ పోలీస్ అకాడమీలో 12వ బ్యాచ్‌కు చెందిన 1,162 మంది సబ్-ఇన్‌స్పెక్టర్లుశిక్షణ పూర్తిచేసుకొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారి పాసింగ్ అవుట్ పరేడ్‌ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ వారికి అభినందనలు తెలియజేసారు. “ఇప్పటివరకు 18,428 మంది కానిస్టేబుల్స్, ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేశాం. త్వరలోనే మరో 20,000 పోస్టులను భర్తీ చేయబోతున్నామని,” తెలిపారు. 

డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ అత్యుత్తమ పనితీరు, ప్రమాణాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. శిక్షణ పూర్తిచేసుకొని విధులలో చేరబోతున్న సబ్-ఇన్‌స్పెక్టర్లు అందరూ కూడా నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తూ తెలంగాణ పోలీస్ శాఖకు మరింత మంచి పేరు తేవాలని కోరారు. ముఖ్యంగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటూ స్మార్ట్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 

పోలీస్ అకాడమీ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అకాడమీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,25,848 మందికి శిక్షణ ఇచ్చామని, వారిలో వివిద ర్యాంకులకు చెందినవారున్నారని తెలిపారు. 


Related Post