నవంబర్‌ 4న సిఎం కేసీఆర్‌ జనగామలో పర్యటన

October 22, 2020


img

వచ్చే నెల 4వ తేదీన సిఎం కేసీఆర్‌ జనగామ జిల్లాలోని కొడకండ్ల గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మించిన రైతువేదిక, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, పల్లె ప్రకృతివనం పార్కుకు సిఎం కేసీఆర్‌ ఆరోజున ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే మినీ టెక్స్‌టైల్‌ పార్కుకు శంఖుస్థాపన చేస్తారు. 

ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుండటంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అధికారులతో నిన్న సమావేశమయ్యి ఏర్పాట్ల గురించి చర్చించారు. తరువాత అధికారులతో కలిసి గ్రామంలో హెలీప్యాడ్ ఏర్పాటు కోసం గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు. సిఎం కేసీఆర్‌ పర్యటనకు ముందే రైతువేదిక, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి జిల్లా కలెక్టరును కోరారు.   Related Post