ప్రధాని సందేశం ఏమిటంటే...

October 21, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం సాయంత్రం దేశప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశంలో కరోనా కట్టడికి అందరూ కలిసి సమిష్టిగా చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. కరోనా రికవరీ రేటు బాగా పెరిగింది. కరోనా మరణాల రేటు బాగా తగ్గింది. దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గిపోయాయని ప్రజలు నిర్లక్ష్యం వహించరాదు. అలా చేస్తే విదేశాలలోలాగా భారత్‌లో కూడా మళ్ళీ కరోనా విజృంభించే ప్రమాదం ఉంటుంది. కనుక దేశప్రజలందరూ తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా రాబోయే పండుగల సమయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అగ్ని, శత్రువును, వ్యాదిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయరాదు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేక మన దేశంలో చివరి వ్యక్తికి కూడా చేరే వరకు ప్రభుత్వం విశ్రమించదు. దేశప్రజలందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు,” అని అన్నారు.           



Related Post