శాసనసభ వద్ద ప్రైవేట్ స్కూల్ టీచర్లు ధర్నా

September 17, 2020


img

లాక్‌డౌన్‌ కారణంగా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు మూతపడటంతో వాటిలో పనిచేస్తున్న వేలాదిమంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు గత ఆరునెలలుగా ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలను పోషించుకోవడానికి నానాకష్టాలు పడుతున్నారు. అయితే వారి గోడు వినే నాధుడే లేకపోవడంతో వారు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు బుదవారం వారందరూ శాసనసభ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. అయితే శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున పోలీసులు వారీనందరినీ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గత ఆరు నెలలుగా అష్టకష్టాలు పడుతున్నామని ప్రభుత్వమే తమకు ఓ దారి చూపించాలని వారు డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.



Related Post