ఆగస్ట్ 5న మంత్రివర్గ సమావేశం

August 01, 2020


img

ఈ నెల 5వ తేదీన ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు, కరోనా కట్టడికి ఇంకా చేయవలసిన ఏర్పాట్లు, విధానపరమైన మార్పులు చేర్పుల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ సమావేశంలో కొత్త సచివాలయ నిర్మాణానికి ఆమోదముద్ర వేయవచ్చు. ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవనం నిర్మించవలసి ఉంది. దానిని వాయిదావేసి సచివాలయ నిర్మాణపనులు మొదలుపెడితే ప్రతిపక్షాల నుంచి మళ్ళీ విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక దానికీ ఈ సమావేశంలో ఆమోదముద్ర వేయవచ్చు. సచివాలయం, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులకు నిధులు కేటాయించవలసి ఉంటుంది. కనుక దానికీ మంత్రివర్గం ఆమోదం తెలుపవచ్చు. Related Post