క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి: రష్యా

July 13, 2020


img

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు కరోనా వ్యాక్సిన్ (టీకా) తయారుచేసేందుకు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే భారత్‌, చైనా, అమెరికా, రష్యా వంటి కొన్ని దేశాలు దానికి సంబందించి క్లినికల్ ట్రయల్స్‌ కూడా ప్రారంభించాయి. గమేలేయ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ తయారుచేసిన తమ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ పూర్తయ్యాయని, అది సత్ఫలితలు ఇస్తోందని రష్యాలోని సెచెనోవ్ ఫస్ట్- స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ప్రకటించింది. జూన్‌18న క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభించామని, మొదటి బ్యాచ్ వాలంటీర్లను గత బుదవారం డిశ్చార్జ్ చేశామని మరో బ్యాచ్ వాలంటీర్లను జూన్‌కు 20న డిశ్చార్జ్ చేయబోతున్నామని యూనివర్సిటీ అధికార ప్రతినిధి అలగ్జాండర్ లూకాషేవ్ తెలిపారు. 

మన దేశంలో భారత్‌ బయోటెక్, జైడస్ కాడిలా హెల్త్ కేర్ కంపెనీలు తయారుచేసిన వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కరోన వ్యాక్సిన్‌ తయారుచేస్తున్న దేశాల వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ ఒక ఆరేడునెలల తేడాతో పూర్తవవచ్చు. కనుక ఈ ఏడాది చివరిలోగా కరోనా వ్యాక్సిన్‌ భారీగా ఉత్పత్తి మొదలయితే వచ్చే ఏడాది జూన్‌లోగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రజలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. 


Related Post