ఉద్యోగులకు శుభవార్త!

July 08, 2020


img

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఓ శుభవార్త! మరో మూడు నెలలు అంటే జూన్‌ నుంచి ఆగస్ట్ నెలవరకు ఉద్యోగులు, కార్మికులు చెల్లించవలసిన 12 శాతం పీఎఫ్ మొత్తాన్ని కేంద్రప్రభుత్వమే చెల్లిస్తుంది. అలాగే కంపెనీలు చెల్లించవలసిన మరో 12 శాతం పీఎఫ్ మొత్తాన్ని కేంద్రప్రభుత్వమే చెల్లిస్తుంది. అంటే కేంద్రప్రభుత్వం ఒక్కో ఉద్యోగి తరపున 24 శాతం పీఎఫ్ సొమ్మును మూడు నెలలపాటు చెల్లించబోతోందన్నమాట! దీని వలన దేశంలో సుమారు 72 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు లబ్దిపొందుతారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. 

ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నామని మంత్రి జవదేకర్ చెప్పారు. అయితే వందమంది కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీలలో నెలకు రూ.15,000 కంటే తక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. 

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకాన్ని మరో 5 నెలలు పొడిగించినట్లు తెలిపారు. ఈ పధకంలో భాగంగా గత 3 నెలల్లో 120 లక్షల టన్నుల ఆహారధాన్యాలు పంపిణీ చేశామని, ఈసారి నవంబర్‌ వరకు మొత్తం 203 లక్షల టన్నుల ఆహారధాన్యాలు (బియ్యం లేదా గోదుమలు, శనగలు) ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్న 81 కోట్లమంది నిరుపేదలకు ఈ పధకం ద్వారా ప్రతీనెల అవసరమైన ఆహారధాన్యాలు అందజేస్తున్నామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు.


Related Post