రైల్వే రిజర్వేషన్ గడువు పెంపు

May 30, 2020


img

రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త! ఇక నుంచి అన్ని ప్రత్యేక రైళ్లలో గతంలోలాగే 120 రోజుల ముందుగా టికెట్లు రిజర్వేషన్లు చేసుకోవచ్చునని రైల్వేశాఖ ప్రకటించింది. మే 12 నుంచి 30 ప్రత్యేక రైళ్లు, జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా మరో 200 ప్రత్యేక రైళ్లు నడిపించబోతున్న సంగతి తెలిసిందే. వాటన్నిటిలో మొదట 30 రోజులు ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేసుకొనేందుకు అనుమతించింది. కానీ మే 31వ తేదీ నుంచి ఈ అన్ని రైళ్ళలో 120 రోజులు ముందుగా రిజర్వేషన్లు చేసుకోవచ్చునని తెలిపింది. 

ఇక కరెంట్ బుకింగ్, తత్కాల్ కోటాలలో సీట్ల కేటాయింపులకు గతంలో అనుసరిస్తున్న విధానాలే కొనసాగుతాయని ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ 230 ప్రత్యేక రైళ్లలో పార్సిల్, లాగేజీ బుకింగ్‌లను కూడా అనుమతిస్తున్నట్లు రైల్వేశాఖ తాజా ప్రకటనలో తెలియజేసింది. 

అయితే ఇదివరకు ప్రకటించిన విధంగానే ప్రయాణికులు కరోనా జాగ్రత్తలు పాటించడం, రైల్వేస్టేషన్‌కు గంటముందుగా చేరుకొని ధర్మల్స్ స్క్రీనింగ్ చేయించుకోవడం వంటివన్నీ ఖచ్చితంగా పాటించాలని రైల్వేశాఖ తెలిపింది. కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ కరోనా లక్షణాలు కనబడితే వారిని రైల్లో ప్రయాణించేందుకు అనుమతించరు. కనుక ఈవిషయం ప్రయాణికులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వివిద రాష్ట్రాలలో వేర్వేరు క్వారెంటైన్‌ నిబందనలు అమలులో ఉన్నాయి. అందుకు సిద్దపడినవారే బయలుదేరడం మంచిది. 

జూన్ 1 నుంచి బయలుదేరే రైళ్ళు, వాటి టైమ్ టేబుల్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయగలరు:http://www.mytelangana.com/telugu/business/21146 


Related Post