టీఎన్జీవో నేతలపై స్టీరింగ్ కమిటీ ఆగ్రహం

May 29, 2020


img

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడంతో ఈనెల కూడా జీతాలు, పెన్షన్లలో కోతలు విధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకులు మౌనం వహించడంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే సంగతి టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకులకు తెలిసి ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని గట్టిగా అడగకుండా మౌనం వహించడం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో వివిద సంఘాలకు చెందిన సుమారు 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.    



Related Post