హైదరాబాద్‌లో నేడు మరో ఫ్లై ఓవర్ ప్రారంభం

May 28, 2020


img

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని జీహెచ్‌ఎంసీ అవసరమైన చోట ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ రోడ్లు నిర్మిస్తోంది. కామినేని జంక్షన్ వద్ద గల ఫ్లై ఓవర్‌ను, ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద ఎడమవైపు సాగిపోయెందుకు కొత్తగా నిర్మించిన అండర్ పాస్ రోడ్డును మునిసిపల్ మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభిస్తారు. ఈవిషయం ఆయన స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 

రూ.43 కోట్లు వ్యయంతో పూర్తి చేసిన కామినేని ఫ్లై ఓవర్‌ 940 మీటర్లు పొడవు, 12 మీటర్లు వెడల్పుతో నిర్మించారు. 

రూ.14 కోట్లు వ్యయంతో నిర్మించిన ఎల్బీ నగర్ అండర్ పాస్ రోడ్డు పొడవు 519 మీటర్లు, వెడల్పు 10.5 మీటర్లు. నేటి నుంచి ఈ రెండు ప్రజలకు అందుబాటులోకి వస్తుండటంతో ఆ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఒత్తిడి కొంతమేరకు తగ్గనుంది. 



Related Post