ఏపీలో 99 కొత్త కేసులు... మొత్తం 2,896

May 26, 2020


img

పొరుగు రాష్ట్రం ఏపీలో సోమవారం 10,240 మందికి కరోనా పరీక్షలు జరుపగా కొత్తగా 99 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వారిలో 45మంది విదేశాల నుంచి తిరిగి వచ్చినవారే. ఏపీలో వారిలో ఇటీవల కువైట్ నుంచి రాష్ట్రానికి తిరిగివచ్చినవారిలో 41 మందికి, ఖతార్ నుంచి ముగ్గురికి, సౌదీ అరేబియా నుంచి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. సోమవారం నమోదైన కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు మొత్తం 2,896 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,892 మంది కోలుకొని ఇళ్లకు చేరుకోగా మరో  938 మంది ప్రస్తుతం వివిద ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 56మంది కరోనాతో మృతి చెందారు. Related Post