హైదరాబాద్‌లో ప్రభుత్వోద్యోగులకు శుభవార్త

May 23, 2020


img

హైదరాబాద్‌లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులకు ఓ శుభవార్త! నగరంలో వివిద ప్రాంతాలలో నివశిస్తున్న వారికోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడుపబోతోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినప్పటికీ ప్రజారవాణా వ్యవస్థలు ఇంకా పనిచేయనందున ఉద్యోగులు కార్యాలయాలు చేరుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు. వారి సౌకర్యార్ధం నగరంలో 32 మార్గాలలో నేటి నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. ఉద్యోగులు తమ గుర్తింపు కార్డులు చూపి ఆ బస్సులలో తమ కార్యాలయాలకు చేరుకోవచ్చు. ఈ బస్సులు తాత్కాలిక సచివాలయంగా ఉన్న బీఆర్‌కె భవన్‌, జలసౌధ, విద్యుత్ సౌధ తదితర కార్యాలయాలకు, మళ్ళీ సాయంత్రం కార్యాలయాల నుంచి వారి నివాస ప్రాంతాలకు ఉద్యోగులను చేరవేస్తాయి. Related Post