వాట్సాప్‌లో సరికొత్త ఆంక్షలు

April 07, 2020


img

కరోనా వైరస్‌ నేపధ్యంలో సోషల్ మీడియాలో నకిలీవార్తలు, పుకార్లు చాలా ఎక్కువైపోవడంతో వాటిలో ఏది నిజమో అబద్దమో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నకిలీ వార్తలు, పుకార్లపై ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అవి ఆగడం లేదు. వాట్సాప్‌ కూడా అటువంటివాటికి వేదికగా మారుతోంది. కనుక వాటిని నియంత్రించేందుకు వాట్సాప్‌ సంస్థ కొత్త ఆంక్షలను అమలులోకి తెచ్చింది. 

తరుచుగా లేదా చాలా ఎక్కువసార్లు షేర్ చేయబడిన సందేశాలను ఇకపై ఒక ఛాట్‌కు ఒకసారికి మించి పంపించడం సాధ్యం కాదు. అటువంటి మెసేజులను గుర్తించేందుకు వీలుగా వాటిపై డబుల్ టిక్స్ కనిపిస్తాయి. ఇక ఎప్పటిలాగే ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువమందికి మెసేజ్ పంపించడం సాధ్యం కాదు. నేటి నుంచే ఈ కొత్త ఆంక్షలు వాట్సాప్‌ అమలులోకి తెచ్చింది. 



Related Post