కరోనా తాజా అప్‌డేట్స్

March 26, 2020


img

కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ దేశంలో కరోనా పరిస్థితిపై గురువారం ఓ ప్రకటన చేసింది. నేటి వరకు దేశంలో అని రాష్ట్రాలలో కలిపి మొత్తం 649 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వారిలో 43 మంది పూర్తిగా కోలుకొన్నారని మరో 593 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 13 మంది కరోనాతో మృతి చెందారని తెలిపింది. 

మహారాష్ట్రలో అత్యదికంగా 124, కేరళలో 118 కరోనా కేసులు నమోదు అయినట్లు ప్రకటించింది.   

తెలంగాణలో 41, ఏపీలో 11, కర్ణాటక-51, తమిళనాడు-26 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

డిల్లీ-35, హర్యానా-31, పంజాబ్-31, రాజస్థాన్-38, ఉత్తరప్రదేశ్-38, ఉత్తరాఖండ్-5, బీహార్-4, మధ్యప్రదేశ్‌-21, ఛత్తీస్ ఘడ్-3, పశ్చిమ బెంగాల్ -10, గుజరాత్-38, హిమాచల్ ప్రదేశ్-3, ఒడిశా-2, గోవా-3, మణిపూర్-1, మిజోరాం-1, పుదుచ్చేరి-1, లడాఖ్-13, జమ్ముకశ్మీర్‌-11 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 


Related Post