కరోనా ఎఫెక్ట్...రాజ్యసభ ఎన్నికలు వాయిదా

March 24, 2020


img

కరోనా ప్రభావం రాజ్యసభ ఎన్నికలపై కూడా పడింది. ప్రస్తుతం దేశమంతా కరోనా లాక్‌డౌన్‌లో ఉంది కనుక ఈనెల 26నా జరుగవలసిన రాజ్యసభ ఎన్నికలు వాయిదావేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ ఈరోజు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 37 స్థానాలలో 10 ఏకగ్రీవాలైనందున, నిజామాబాద్‌తో సహా మిగిలిన 18 స్థానాలకు ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. కొన్నిరోజుల తరువాత దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితులను సమీక్షించిన తరువాత ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకొంటామని ఎన్నికల కమీషన్ తెలిపింది. నిజామాబాద్‌ రాజ్యసభ స్థానానికి స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరుగవలసి ఉంది. టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా కవిత పోటీ చేస్తుండగా కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సుభాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో దిగినందున నిజామాబాద్‌లో ఎన్నికలు అనివార్యమయ్యాయి లేకుంటే కవిత ఎన్నిక ఏకగ్రీవం అయ్యుండేది.       

 Related Post