మా ఉద్యమాన్ని దెబ్బ తీయడం కోసమే కుట్ర: ఓవైసీ

February 21, 2020


img

సీఏఏకు వ్యతిరేకిస్తూ ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్‌’ పేరుతో గురువారం బెంగళూరులో జరిగిన సభలో అమూల్య లియోన్ అనే ఓ యువతి ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేయడంపై ఆ సభలో పాల్గొన్న మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “ఆ యువతితో...ఆమె అభిప్రాయాలతో మజ్లీస్ పార్టీకి ఎటువంటి సంబందమూ లేదు. మనమంతా భారతీయులం. సీఏఏను అడ్డుకొని దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ సభ నిర్వహించుకొంటున్నాము తప్ప శతృదేశమైన పాకిస్థాన్‌కు మద్దతు పలకడానికి కాదు. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలను దెబ్బతీయడం కోసమే ఎవరో ఇటువంటి కుట్రపన్నారనే అనుమానం కలుగుతోంది. కనుక ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు విచారణ జరిపి నిజనిజాలు బయటపెట్టాలని కోరుతున్నాను,” అని అన్నారు. Related Post