రాజకీయ అవసరాల కోసమే కేసీఆర్‌, ఓవైసీల దోస్తీ: బిజెపి

February 20, 2020


img

బిజెపి సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు చాలాకాలం తరువాత ఇవాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. డిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త బిజెపి అధ్యక్షుల నియామకం జరుగనుంది. తెలంగాణలో ఇప్పటికే మేము బాగా పుంజుకొన్నాము. తెలంగాణ రాష్ట్రంలో నయా నిజాంపాలన సాగుతోంది. సిఎం కేసీఆర్‌, ఓవైసీలు వారి రాజకీయ అవసరాల కోసమే చేతులు కలిపి సీఏఏను వ్యతిరేకిస్తున్నారు తప్ప సీఏఏలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందీలేదని అందరికీ తెలుసు. ప్రధాని నరేంద్రమోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకొంటూ ఆర్టికల్ 370, రామమందిరం, ట్రిపుల్ తలాక్ వంటి అనేక దీర్గకాలిక సమస్యలను పరిష్కరిస్తుండటంతో నానాటికీ ఆయనకు ప్రజాధారణ పెరుగుతోంది. అది చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు సీఏఏపై అనవసర రాద్దాంతం చేస్తున్నాయి. అయితే దేశ భవిష్యత్‌ కోసం ప్రధాని నరేంద్రమోడీ తీసుకొంటున్న చొరవను దేశప్రజలందరూ గమనిస్తున్నారు,” అని సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. 



Related Post