అదిలాబాద్ జిల్లా కలక్టర్ శ్రీదేవసేనకు ప్రతిష్టాత్మక అవార్డు

February 20, 2020


img

అదిలాబాద్ జిల్లా కలక్టర్ శ్రీదేవసేనకు ప్రతిష్టాత్మక ‘ద వరల్డ్‌ ఉమేన్‌ లీడర్‌షిప్‌’ అవార్డు అందుకున్నారు. ఏటా సీఎంఓ వరల్డ్‌ సంస్థ ప్రపంచదేశాలలో వివిదరంగాలలో కృషి చేస్తున్న మహిళలను గుర్తించి ఈ అవార్డులను అందజేస్తుంటుంది. ఇటీవల ముంబైలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో కలక్టర్ శ్రీదేవసేన అవార్డును అందుకున్నారు. 

2018లో ఆమె పెద్దపల్లి జిల్లా కలక్టరుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు జిల్లాలో డెంగీ జ్వరాలు విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాలకంటే అదిలాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 271 డెంగీ జ్వరాల కేసులు నమోదు అయ్యాయి. దాంతో అప్రమత్తమైన కలక్టర్ శ్రీదేవసేన వెంటనే జిల్లా వ్యాప్తంగా యుద్ధప్రాతిపాదికన మురుగు కాలువల క్లీనింగ్, దోమల నివారణ, పచ్చదనం, పరిశుభ్రత పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. దాంతో నెలల వ్యవదిలోనే జిల్లాలో డెంగూ జ్వరాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్‌ పంపిణీ వంటి అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టారు. కలక్టర్ శ్రీదేవసేన ఎంతో చిత్తశుద్దితో కృషి చేసి సత్ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సీఎంఓ వరల్డ్‌ సంస్థ ప్రకటించింది. ఆమెకు ఇప్పటికే నాలుగు జాతీయస్థాయి అవార్డులు అందుకున్నారు.   



Related Post