మార్చి 6 నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు?

February 20, 2020


img

వచ్చే నెల 6వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆనవాయితీ ప్రకారం తొలిరోజున గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. మరుసటిరోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. హోళీ పండుగ సందర్భంగా మార్చి 8న శాసనసభ సమావేశాలు ఉండవు. మార్చి 10న మళ్ళీ శాసనసభ సమావేశమైనప్పుడు ఆర్ధికమంత్రి హరీష్‌రావు 2020-21 ఆర్ధిక సం.లకు రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. మార్చి 22 వరకు శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించవచ్చునని తెలుస్తోంది. ఈఏడాది కూడా కేవలం నాలుగు రోజులే శాసనమండలి సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.     Related Post