పార్లమెంటు ఆమోదించిన బిల్లును అసెంబ్లీ వ్యతిరేకించగలదా?

February 18, 2020


img

పార్లమెంటు ఆమోదించిన సీఏఏ బిల్లును అసెంబ్లీ వ్యతిరేకించగలదా?అని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు. సిఎం కేసీఆర్‌ కేవలం ఓవైసీల మెప్పు కోసమేసీఏఏను వ్యతిరేకిస్తున్నారా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్థాన్‌, బాంగ్లాదేశ్ ముస్లింలపై కేసీఆర్‌, కేటీఆర్‌లకు అంత ప్రేమ ఉన్నట్లయితే, వారందరికీ భారత్‌ పౌరసత్వం కల్పించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఎన్‌పీఆర్‌ను కూడా అమలుచేస్తారో లేదో సిఎం కేసీఆర్‌ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిఎం కేసీఆర్‌ మజ్లీస్ నాయకులను పెంచి పోషిస్తే ఏదో ఓ రోజు వారే కేసీఆర్‌ను దెబ్బతీస్తారని కె.లక్ష్మణ్‌ అన్నారు. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి యూసఫ్ గూడాలో పార్టీ కార్యకర్తలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “సీఏఏను వ్యతిరేకిస్తున్నామని అందరూ చెపుతుంటారు కానీ దాని వలన ఎవరికి ఏవిధంగా నష్టమో చెప్పలేకపోతున్నారు. సీఏఏ వలన దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారు తప్ప 130 కోట్లమంది భారతీయులలో ఏ ఒక్కరికీ నష్టం కలుగదని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ దేశాభివృద్ధి కోసం ప్రణాళికాబద్దంగా పనిచేస్తూ సహసోపేతమైన నిర్ణయాలు తీసుకొంటుంటే, ప్రతిపక్షాలు ఆయనపై బురదజల్లుతూ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏ బిల్లుపై ఎవరితోనైనా బహిరంగ చర్చకు సిద్దమని కిషన్ రెడ్డి సవాలు విసిరారు.


Related Post