భరత్‌నగర్ ఫ్లైఓవరుపైనుంచి కింద పడిన కారు

February 18, 2020


img

హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌ ఫ్లైఓవరుపై వెళుతున్న ఓ కారు అదుపు తప్పి కిందన రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒక వ్యక్తి ఘటనాస్థలంలోనే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

గత ఏడాది నవంబరులో బయోడైవర్సిటీ ఫ్లైఓవరుపై నుంచి ఓ కారు ఇలాగే అదుపుతప్పి కిందన బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళపై పడటంతో  ఆమె చనిపోయింది. మరో ఇద్దరు గాయపడ్డారు. మళ్ళీ అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నివారించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు అనేక చర్యలు చేపట్టారు. కానీ నగరంలో మిగిలిన ఫ్లై ఓవర్లపై కూడా అటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భరత్‌నగర్‌ ఫ్లైఓవరు ప్రమాదం తెలియజేస్తోంది. కనుక జీహెచ్‌ఎంసీ నగరంలో అన్ని ఫ్లై ఓవర్లపై వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది.        Related Post