నిర్భయకేసు విచారణలో సొమ్మసిల్లిన న్యాయమూర్తి

February 14, 2020


img

నిర్భయ కేసులలో న్యాయావకాశాలు ముగిసిన దోషులను వేర్వేరుగా ఉరి తీయాలని కోరుతూ కేంద్రప్రభుత్వం, డిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌.భానుమతి లో విచారణ జరుపుతున్నప్పుడు అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. కోర్టు సిబ్బంది వెంటనే స్పందించి ఆమెకు ప్రాధమిక వైద్యం అందించడంతో కొద్దిసేపు తరువాత ఆమె తేరుకున్నారు. అనంతరం కేసును వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే వారం ఈ కేసును ముగిస్తానని జస్టిస్ భానుమతి తెలిపారు. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ కేసు ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని విచారణ చేసేందుకు వచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.         Related Post