కాళేశ్వరం ఇంజనీర్లకు కేసీఆర్‌ సూచనలు

February 14, 2020


img

సిఎం కేసీఆర్‌ నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా ప్రాజెక్టు ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. “ప్రాజెక్టులో అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, సిబ్బంది, కార్మికులు అందరూ చక్కటి సమన్వయంతో పనిచేసి గత ఏడాది వర్షాకాలానికి ముందుగానే కాళేశ్వరం ప్రాజెక్టును సిద్దం చేశారు. అదేవిధంగా ఈ ఏడాది వర్షంకాలంలో వచ్చే వాన నీటిని నూటికి నూరుశాతం సద్వినియోగం చేసుకొనేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలి. ప్రాజెక్టులో ఎదురైన సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవాలి. పని విభజన చేసుకొని ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. పోలీసుల మాదిరిగా వైర్ లెస్ వాకీటాకీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ప్రాజెక్టులోకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో, వాటిని ఎప్పుడు ఎంతమేర విడుదల చేస్తున్నారో.. విడుదల చేసిన నీటిని ఎటువైపు మళ్లించాలో... అన్నీ మాట్లాడుకొంటూ ప్రతీ వర్షపు చుక్కను ఒడిసి పట్టుకొని 100 శాతం సద్వినియోగించుకోవాలి. ప్రాజెక్టు నిర్వహణ మీ సమర్ధతపైనే ఆధారపడి ఉంటుందనేది మరిచిపోవద్దు. ప్రాజెక్టును బాగా నిర్వహిస్తే, రాష్ట్రంలో ఇక నీటికి కరువు ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయసహకారాలు కావాలన్నా అందించడానికి మేము సిద్దంగా ఉన్నాము,” అని సిఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. 


Related Post