మునిసిపల్ ఎన్నికలలో భారీగా పోలింగ్

January 22, 2020


img

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈసారి మునిసిపల్ ఎన్నికలలో అంచనాలకు మించి చాలా భారీగా పోలింగ్ జరిగింది. తాజా సమాచారం ప్రకారం సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 80 శాతం వరకు పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. చెదురుముదురు ఘటనలు తప్ప ఎక్కడా అవాంఛనీయఘటనలు జరుగలేదు. 

తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా చౌటుప్పల్‌లో 93.31 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 

మెదక్‌-82.12, సంగారెడ్డి-72.29,షాద్ నగర్-78.45, తూఫ్రాన్-82.03, బొల్లారం-65.16, హుజూరాబాద్-82.49, గద్వాల-80.49, కొంపల్లి-66.03, పోచంపల్లి-92.51, నర్సంపేట-84.25, వర్ధన్నపేట-88.62, ధర్మపురి-76.36, బెల్లంపల్లి-78, చెన్నూరు-75.80, వైరా-86.46, డోర్నకల్-83.20, కొత్తపల్లి-79.74, చొప్పదండి-81.12, మంధని-79.83, అయిజ-87.06, వడ్డేపల్లి-84.24, పెబ్బేరు-82.24, చిట్యాల-89.75, ఆమన్‌గల్-85.76, అమరచింత-80.69, తుక్కుగూడ-82.46, నేరేడుచెర్ల-79.01, తూముకుంట-71.82, సదాశివపేట-81.78 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.


Related Post