తెలంగాణ మునిసిపల్ పోలింగ్ షురూ

January 22, 2020


img

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ బుదవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా నిజామాబాద్‌, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్ వంటి కొన్ని జిల్లాలలో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. నల్గొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట తదితర జిల్లాలో మాత్రం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. 

ఈరోజు జరుగుతున్న పోలింగులో సుమారు 50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. మొత్తం 9 మునిసిపల్ కార్పొరేషన్లకు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించారు. 

120 మున్సిపాలిటీలలో 11,099 మంది, 9 కార్పొరేషన్ల పరిధిలో 1,746 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. మున్సిపాలిటీలలో 2,727 మంది కౌన్సిలర్ పదవులకు పోటీ పడుతున్నారు. వివిద జిల్లాలోని మున్సిపాలిటీలలో 80 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 


Related Post