కె4 క్షిపణి ప్రయోగం విజయవంతం

January 20, 2020


img

భారత్‌ అంతరిక్ష పరిశోధనలలోనే కాక సొంతంగా అత్యంత శక్తివంతమైన క్షిపణులను తయారుచేసుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకొంటోంది. డిఆర్డివో అధ్వర్యంలో ఆదివారం విశాఖ సముద్రతీరంలో జరిపిన కె4 బాలిస్టిక్ మిసైల్ పరీక్ష విజయవంతం అయ్యింది. భారత్‌ నావికాదళానికి చెందిన అణు జలాంతర్గామి అరిహంత్ నుంచి ప్రయోగించిన కె4 బాలిస్టిక్ మిసైల్ తీరానికి 35 నాటికల్ మైల్స్ దూరంలో సముద్రంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని ఛేదించిందని డిఆర్డివో అధికారులు తెలిపారు. సుమారు 14 టన్నుల బరువుతో రెండు వార్ హెడ్స్ కలిగిన ఈ క్షిపణితో 3,500 కిమీ దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించవచ్చునని డిఆర్డివో అధికారులు తెలిపారు. శత్రుదేశాల యుద్ధనౌకలు లేదా జలాంతర్గాములు భారత్‌ సముద్రజలాలలోకి ప్రవేశించే దుస్సాహాసం చేస్తే అరిహంత్ జలాంతర్గామి వాటిని కె4 క్షిపణితో నాశనం చేయగలదు. కనుక అరిహంత్ జలాంతర్గామికి కె4 క్షిపణి సామర్ధ్యం సమకూరడంతో సువిశాలమైన సముద్రతీరం కలిగిన భారత్‌కు మరింత భద్రత ఏర్పడినట్లయింది.



Related Post