మోడీ, బిజెపీలను చూసి మేమేందుకు భయపడాలి? కేటీఆర్

January 13, 2020


img

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మద్య విమర్శలు, ప్రతివిమర్శలు మొదలయ్యాయి. వాటి వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగమూ ఉండదు కేవలం కాలక్షేపం, వినోదం తప్ప. ఉదాహారణకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మొన్న మీడియాతో మాట్లాడుతూ, బీజేపీని చూసి తెరాసకు, కేటీఆర్ కు భయం పట్టుకొందన్నారు. అయితే బీజేపీని చూసి తెరాస ఎందుకు భయపడుతోందో చెప్పలేదు కనుక తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే ప్రశ్న అడిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “బిజెపీని చూసి మేమేందుకు భయపడాలి? మేము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు, ప్రధాని  నరేంద్రమోడీ, రాహుల్ గాంధీలకు భయపడబోము. మాకు ఆ అవసరం లేదు కూడా. నిజానికి మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులు లేక అన్ని చోట్లా అభ్యర్ధులను పోటీకి నిలబెట్టలేని దుస్థితిలో బీజేపీ ఉంది. అటువంటి పార్టీని చూసి మేమేందుకు భయపడతాము. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో బీజేపీకి స్వతంత్ర అభ్యర్ధికి వచ్చినాన్ని ఓట్లు కూడా రాలేదు. ఈసారి మునిసిపల్ ఎన్నికలలో అవి కూడా వస్తాయో లేదో,” అని ఎద్దేవా కేటీఆర్ చేశారు.

ఏ ఎన్నికలు లేనప్పుడు, రాష్ట్రంలో తెరాసకు మేమే ప్రత్యామ్నాయమని కె లక్ష్మణ్ చెప్పుకొంటుంటారు. కానీ ఎన్నికలొచ్చేసరికి అభ్యర్ధులను వెతుకోవడం బీజేపీకి పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. కానీ ప్రతీసారిలాగే ఎన్నికలకు ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం, ఓడిపోయిన తరువాత తెరాస డబ్బు వెదజల్లి గెలిచిందని, అయినా తమ లక్ష్యం ఈ ఎన్నికలు కావు 2023లొ జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలని సర్ధిచెప్పుకోవడం పరిపాటిగా మారింది. కనుక తెరాస-బీజేపీ నేతల మద్య జరిగే ఈ వాదోపవాదాలు ప్రజలకు కాలక్షేపం కోసం మాత్రమే పనికి వస్తాయని చెప్పవచ్చు.  


Related Post