నాకు పట్టాభిషేకమా..ఎ..పూ..డు? కేటీఆర్‌

January 04, 2020


img

మునిసిపల్ ఎన్నికల తరువాత సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళబోతున్నారని, కనుక అప్పుడు తన కుమారుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రిని చేస్తారని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. కొందరు మంత్రులు, తెరాస నేతలు కూడా ‘కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. కేసీఆర్‌ తరువాత ఆయనే ముఖ్యమంత్రి కావడం తధ్యం... ఆయనను ఎప్పుడు ముఖ్యమంత్రిని చేయాలో సిఎం కేసీఆర్‌ నిర్ణయిస్తారంటూ’ మాట్లాడిన మాటలు ఆ ఊహాగానాలు నిజమేనని ప్రజలు భావించేలాచేశాయి. కానీ మంత్రి కేటీఆర్‌, ఆంధ్రజ్యోతి మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “నాకు పట్టాభిషేకం అంటూ మీరు ఫ్రంట్ పేజీలో రాసినందుకు నేను చాలా ఇబ్బంది పడ్డాను. తెరాసలో అసలు అటువంటి ఆలోచనే జరుగలేదు. కానీ మీరే తేదీలు, ముహూర్తలు కూడా ప్రకటించేస్తున్నారు,” అని అన్నారు. 

“మరి మీ మంత్రులు, నేతలు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఎందుకు చెప్పారు?” అనే ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ ఒక పరిణతి చెందిన రాజకీయనాయకుడిలాగా సమాధానం చెప్పారు. “మీ మీడియా మిత్రులు పదేపదే అడుగుతుంటే వాళ్ళు ఆవిధంగా చెప్పి ఉంటారు తప్ప వాళ్ళంతట వాళ్ళు ఎవారూ చెప్పలేదు,” అని సమాధానం చెప్పారు.


Related Post