దిశ-ఎన్‌కౌంటర్‌ విచారణకు కమిటీ ఏర్పాటు

December 12, 2019


img

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన ప్రజాహిత పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు, దీనిపై లోతుగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో త్రిసభ్య ఎంక్వైరీ కమీషన్ ఏర్పాటు చేసింది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాష్, సిబిఐ మాజీ అధినేత కార్తికేయన్ దానిలో సభ్యులుగా నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కమిటీ 6 నెలలలోగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ త్రిసభ్య ఎంక్వైరీ కమీష న్‌కు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ అన్నివిధాల సహకరించాలని ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌ చేయబడిన నిందితుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్న పిటిషనర్‌ అభ్యర్ధనను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది. నిందితులు అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన సంగతిని గుర్తుంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అటువంటివారికి నష్టపరిహారం చెల్లించాలనడం చాలా అసహజంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టు అడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పలేక తడబడటం విశేషం. 


Related Post