దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విచారణ

December 11, 2019


img

దిశ ఘటన యావత్ దేశాన్ని ఎంతగా కుదిపేసిందో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కూడా అంతగాను కుదిపేసింది. దిశ ఘటనను యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించినట్లే, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను దాదాపు కూడా ముక్తకంఠంతో సమర్ధించడం విశేషమే. అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు కూడా వినబడుతూనే ఉన్నాయి. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

“సత్వర న్యాయం పేరిట ప్రతీకారం తీర్చుకోవడం న్యాయం కాదు. నేరనిర్ధారణ జరుగకుండా శిక్షలు అమలుచేయడం మొదలుపెడితే న్యాయవ్యవస్థకు అర్ధం లేకుండా పోతుంది,” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా దీనిపై మాజీ న్యాయమూర్తితో లోతుగా విచారణ జరిపించాలని భావిస్తునట్లు జస్టిస్ బాబ్డే చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌ తదుపరి దర్యాప్తుపై తగిన సూచనలు, సలహాలు ఈయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీని కోరారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, పోలీస్ అధికారులపై లోతుగా దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.


Related Post