అత్యాచారాలకు ఏపీలో ఇకపై ఉరి శిక్ష?

December 09, 2019


img

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. దిశ ఘటనపై ప్రజాగ్రహం, ఎన్‌కౌంటర్‌పై వినిపిస్తున్న భిన్నస్వరాల నేపద్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది. అత్యాచారాల కేసులపై మూడు వారాలలోగానే విచారణ పూర్తి చేసి దోషులకు ఉరి శిక్ష విధించేలా చట్టం చేయబోతోంది. ఈ కేసుల విచారణకు ప్రతీ జిల్లాలో ఒకటి చొప్పున జిల్లా జడ్జీతో కూడిన ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయడానికి, అవసరమైతే అదనంగా మరో కోర్టును కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు వీలుకల్పిస్తూ ఈ సమావేశాలలో కొత్త చట్టం లేదా చట్ట సవరణ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రస్తుతం ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టబోతోంది. 

ఈ సమావేశాలలోనే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా ప్రజా రవాణాశాఖను ఏర్పాటు చేస్తూ చట్టం చేయబోతోంది. ఇది అమలులోకి వస్తే ఏపీలో 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వోద్యోగులవుతారు. 


Related Post