నిర్భయ దోషులకు ఉరిశిక్ష పక్కా

December 06, 2019


img

అత్యాచారాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా స్పందించారు. ఇటీవల రాజస్థాన్‌లో ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆయన మాట్లాడుతూ, “దేశంలో నానాటికీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టలంటే ప్రస్తుతం ఉన్న చట్టాలని సవరించాల్సి ఉంది. అత్యాచార నిందితులను క్షమించవలసిన అవసరం లేదు. కనుక క్షమాభిక్ష పిటిషన్‌ విధానాన్ని కూడా కేంద్రప్రభుత్వం మార్పు చేయాలి. మహిళల రక్షణ కోసం దేశప్రజలు కోరుకొన్నట్లుగా నేరస్తులను శిక్షించే విధంగా చట్టాలు రూపొందించవలసిన అవసరం ఉంది. అప్పుడే ఇటువంటి నేరాలకు పాల్పడేవారిని అదుపు చేయగలుగుతాము,” అని అన్నారు. 

అంటే అత్యాచారాలకు పాల్పడిన వారికి దేశప్రజలు కోరుతున్నట్లు బహిరంగంగా కాకపోయినా తప్పనిసరిగా ఉరి శిక్ష విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచిస్తున్నట్లు అర్దమవుతోంది. కనుక నిర్భయ నిందితులు పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించబోతున్నారని స్పష్టం అయ్యింది. ఆ ఘటన జరిగి 7 సంవత్సరాలయింది కానీ నేటికీ దోషులకు శిక్షలు అమలుచేయకపోవడంపై దేశప్రజలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక త్వరలోనే వారూ ఉరి కంబం ఎక్కడం ఖాయమేనని భావించవచ్చు. 


Related Post