గ్యాంగ్‌స్టర్ నయీమ్ సోదరి సలీమా అరెస్ట్

November 21, 2019


img

గ్యాంగ్‌స్టర్ నయీమ్ సోదరి సలీమా బేగంను భువనగిరి పోలీసులు బుదవారం అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం ఆమె భర్త నయీమ్, అనుచరులు కలిసి భువనగిరి, నల్గొండ, శంషాబాద్, షాద్‌నగర్, పహాడీ షరీఫ్, ఆదిభట్ల, ఆలేరు, నర్శింగి, మిర్యాలగూడ, కోరుట్ల పోలీస్‌స్టేషన్ల పరిధిలో అనేకమంది వ్యక్తులను భయపెట్టి, బెదిరించి బలవంతంగా వారికి చెందిన భూములను సలీమా బేగంతో సహా తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వారికి అమ్మేశారు. నయీమ్  ఎన్‌కౌంటర్ తరువాత ఆ భూముల యజమానులు పోలీస్‌స్టేషన్లకు వచ్చి పిర్యాదులు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ప్రజలను భయపెట్టడం, బెదిరించడం, వారిపై దౌర్జన్యం చేయడం, బలవంతంగా వారి భూములను లాక్కొని ఇతరులకు అమ్మివేయడం తదితర నేరాలకు సంబందించి వివిద సెక్షన్ల క్రింద మొత్తం 14 కేసులు నమోదు చేశారు. ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు.



Related Post