కేసీఆర్‌కు భట్టి విక్రమార్క సూచన

November 19, 2019


img

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులు కనుకనే ఎంతో పోరాడి రాష్ట్రం సాధించుకొన్నారు. కానీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సమాజం సిఎం కేసీఆర్‌ చేతిలో బందీగా మారిపోయింది. తెలంగాణ సమాజం ధైర్యంగా భావవ్యక్తీకరణ చేయలేని దుస్థితిలో ఉందిప్పుడు  

తెలంగాణ సాధన కోసం పోరాడిన ఆర్టీసీ కార్మికులను కన్నబిడ్డల వలె చూసుకోవలసిన సిఎం కేసీఆర్‌ వారి పట్ల ఎంతో కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు న్యాయవ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థలు అంటే గౌరవం, ఖాతరు లేదు. కన్నబిడ్డల వంటి 48,000 మంది ఆర్టీసీ కార్మికుల ఆకలి కేకలు వినిపించడం లేదు. సిఎం కేసీఆర్‌ అధికార గర్వంతో ఒక నియంతలాగ మితిమీరిన అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వెంటనే వారిని ఉద్యోగాలలోకి తీసుకోవాలి. దయచేసి ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేయవద్దు,” అని విజ్ఞప్తి చేశారు. 



Related Post