సడక్ బంద్‌ వాయిదా... సమ్మె యధాతధం

November 19, 2019


img

ఆర్టీసీ సమ్మె కేసును హైకోర్టు కార్మికశాఖ చేతికి అప్పగించడంతో 45 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు షాక్ అయ్యాయి. ప్రభుత్వం తమను మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకోదలచుకోలేదని హైకోర్టులో మరోసారి స్పష్టం చేయడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాయి. కనుక నేడు తలపెట్టిన ‘సడక్ బంద్‌’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొంటున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ, ఆహ్వానం లేనందున సమ్మె ముగించి ఇంట్లో కూర్చోంటే ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది కనుక తమ హక్కులను కాపాడుకోవడం కోసం సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. 

ఆర్టీసీ సమ్మె కేసును కార్మిక న్యాయస్థానానికి బదిలీ చేయాలనే హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఈరోజు ఆర్టీసీ ప్రయివేటీకరణ, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరుగనుంది కనుక దానిపై కూడా హైకోర్టు అభిప్రాయం విన్న తరువాత ప్రభుత్వం స్పందించవచ్చు.  ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కోర్టు ఉత్తర్వుల కాపీ చేతికి అందిన తరువాత ఏమి చేయాలో నిర్ణయించుకోవాలని ఎదురు చూస్తున్నాయి. 


Related Post