నేను 11వ వాడిని: జగ్గారెడ్డి

November 16, 2019


img

త్వరలో తెలంగాణ పిసిసికి కొత్త అధ్యక్షుడుని నియమించడానికి కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు ప్రారంభించడంతో కాంగ్రెస్ నేతల మద్య పోటీ మొదలైంది. సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ రేసులో ఇప్పటికే 10 మంది ఉన్నారని తాను 11వ వాడినని జగ్గారెడ్డి చమత్కరించారు. తనకు పిసిసికి కొత్త అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వద్ద గొప్ప వ్యూహం ఉందని జగ్గారెడ్డి చెప్పుకొంటున్నారు. ఇక నుంచి పూర్తిసమయం పార్టీ కార్యక్రమాలకే కేటాయించి మళ్ళీ పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోననని జగ్గారెడ్డి ప్రకటించారు. తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వవలసిందిగా పార్టీ అధిష్టానికి లేఖలు వ్రాశానని, అదేపని మీద త్వరలో డిల్లీకి వెళ్ళి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని రాహుల్ గాంధీని కలుస్తానని చెప్పారు. పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి లభిస్తుందో తెలియదు కానీ దాని కోసం పార్టీ నేతల మద్య కుమ్ములాటలు మొదలయ్యాయి. వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,  రేవంత్‌ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి తదితరులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు.         Related Post