రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా నియామకం

November 16, 2019


img

తెరాసలో ఫైర్ బ్రాండ్ లీడర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని తెలంగాణ రైతు సమన్వయ సమితి (తెరాసస) అధ్యక్షుడిగా నియమించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించి ఆమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదివరకు తెరాసస అధ్యక్షుడిగా పనిచేసిన గుత్తా  సుఖేందర్ రెడ్డి శాసనమండలి ఛైర్మన్‌గా నియమితులవడంతో ఆయన స్థానంలో తెరాస సీనియర్ నేత పల్లాను నియమించారు. వచ్చే ఏడాది జూన్‌లోగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెరాసస కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రాష్ట్రంలో రైతులను సంఘటిత పరిచి, రైతు సమస్యల పరిష్కారించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులపై అధికారులతో సిఎం కేసీఆర్‌ సమీక్షాసమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. Related Post